‘రాయలసీమ’లో అటెండర్ హంగామా!
నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో అటెండర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఏసీ కోచ్‌లో ఇష్టానుసారంగా వ్యవహరించడమే కాకుండా, మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రయాణికులు సోషల్‌మీడియాలో వైరల్ చేయడంతో విషయం వెలుగుచూసింది.
- మహిళా ప్రయాణికులతో అసభ్యకర ప్రవర్తన
- సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
వినాయక్‌నగర్, మే 8: నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో అటెండర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఏసీ కోచ్‌లో ఇష్టానుసారంగా వ్యవహరించడమే కాకుండా, మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రయాణికులు సోషల్‌మీడియాలో వైరల్ చేయడంతో విషయం వెలుగుచూసింది. నిజామాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు పలువురు రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ కోచ్‌లో సీట్లను రిజర్వ్ చేసుకున్నారు. అయితే ఆ కోచ్‌లో పనిచేసే ఓ అటెండర్ రైలు నడుస్తుండగా ఏసీ కోచ్‌లోకి వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించాడు.
అంతేకాకుండా మద్యం తాగి ఉన్న సద రు అటెండర్ ఆ కోచ్‌లో ప్రయాణం చేస్తున్న మహిళలతో అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో తోటి ప్రయాణికులు తమ సెల్ఫోన్లో వీడియో రికార్డు చేశారు. అయితే ఇలా చేయడం ఏంటని సదరు అటెండర్‌ను ప్రయాణికులు ప్రశ్నిస్తే మరో అటెండర్ అక్కడికి వచ్చి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఎదురు తిరగడం వీడియోలో రికార్డయ్యింది. దీంతో సదరు అటెండర్ దురుసు ప్రవర్తన మొత్తం వీడియో రూపంలో సామాజిక మాధ్యమాలో వైరల్కావడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏసీ కోచ్‌లో బెట్షీట్లు ఇచ్చేందుకు అటెండర్లు తమ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కొంతమంది ప్రయాణికులు పోస్టులు పెట్టారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

