e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home కామారెడ్డి నగర, పట్టణ ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాల పెంపు

నగర, పట్టణ ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాల పెంపు

  • ఒకేసారి 30 శాతం మేరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • జూన్‌ నుంచే అమల్లోకి ప్రభుత్వ నిర్ణయం
  • పట్టణ సంస్థల పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ
  • వేతనాల పెంపుతో ఇనుమడించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్ల గౌరవం

బోధన్‌, నవంబర్‌ 30 : మున్సిపల్‌ కార్పొరేషన్లు, పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీచేయడంతో హర్షం వ్యక్తమవుతున్నది. వారికి ఒకేసారి 30 శా తం మేర గౌరవ వేతనాలు పెంచడంతో.. స్థానిక ప్రజాప్రతినిధులుగా తమ గౌరవం ఇనుమడించిందని వారు సంబురపడుతున్నారు. జిల్లాలోని ము న్సిపల్‌ కార్పొరేషన్లలో ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లకు, పురపాలక సంఘాల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లకు ఈ పెరిగిన గౌరవ వేతనాలు వర్తించనున్నాయి. రెండు నెలల కిందట సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాలను ఒకేసారి పెద్ద ఎత్తున పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు నగర, పట్టణ సంస్థల ప్రజాప్రతినిధులకు వేతనాలను పెంచడం ద్వారా వారికి గౌరవించినట్లయింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు తక్కువగా ఉండేవి. అతి తక్కువ వేతనాలు తమను అగౌరవపర్చేవిగా ఉన్నాయని వారు అప్పట్లో మదనపడేవారు. అయితే రాష్ట్ర ఆవిర్భా వం అనంతరం వారి వేతనాలు పెరిగాయి. ఇప్పుడు మరోసారి వారి వేతనాలను ఏకంగా 30 శాతం మేరకు పెంచడం గమనార్హం. రాష్ట్రంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీల గౌరవ వేతనాల పెంపుదలతో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల గౌరవ వేతనాలను పెంచడంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషి ఉంది.

పెరిగిన వేతనాలు ఇలా..
వేతన సవరణలో ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం మేరకు పెంచిన సీఎం కేసీఆర్‌.. స్థానిక ప్రజాప్రతినిధుల విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు మాదిరిగానే 30 శాతం గౌరవ వేతనాలు పెరగడంతో తమ గౌరవం ఇనుమడించిందని, తమకు ఒక గుర్తింపు ఉందన్న సంతోషం కలుగుతుందని పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అంటున్నారు.
ఈ పెరిగిన వేతనాలను సైతం ఈ ఏడాది జూన్‌ ఒకటి నుంచి అమలవుతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -

పెరిగిన వేతనాలు ఇలా..
మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఇప్పటి వరకు మేయర్‌కు నెలకు రూ.50,000 గౌరవ వేతనం ఉండగా, ప్రస్తుతం రూ.65,000కు పెంచారు. డిప్యూటీ మేయర్లకు రూ.25,000 ఉండగా రూ.32,500 లకు పెంచారు. కార్పొరేటర్లకు గౌరవ వేతనం రూ.6000 ఇస్తుండగా ఇకనుంచి వారికి రూ. 7,800 చెల్లించనున్నారు. ఇక, 2011 జనాభా లె క్కల ప్రకారం 50 వేల మంది కన్నా ఎక్కువ జ నాభా ఉన్న మున్సిపాలిటీల్లో మున్సిపల్‌ చైర్మన్లకు ఇప్పటివరకు నెలకు రూ.15,000 గౌర వ వేతనం ఇస్తుండగా ఇప్పుడది రూ.19,500లకు పెరగనున్నది. వైస్‌చైర్మన్‌కు రూ.7,500 ఉండగా ప్రస్తుతం అది రూ.9,750 పెరిగింది. ఈ మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లకు గౌరవ వేతనంగా నెలకు రూ.3,500 ఇచ్చేవారు.ఇకపై వారికి నెలకు రూ. 4,550 చొ ప్పున ఇస్తారు. 50 వేల జనాభా కన్నా తక్కువ ఉ న్న మున్సిపాలిటీల్లో (2011 జనాభా లెక్కల ప్రకా రం) ప్రస్తుతం చైర్మన్లకు రూ. 12,000, వైస్‌ చై ర్మన్లకు రూ.5000 గౌరవ వేతనాలు ఉన్నాయి. ఈ వేతనాలు ఇప్పుడు రూ. 15,600, రూ.5,500 లకు పెరిగాయి. ఈ పురపాలక సంఘాల్లో కౌన్సిలర్లకు ప్రస్తుతం నెలకు రూ.2,500 గౌరవ వేతనం ఇస్తున్నారు. పెరిగిన వేతనాల ప్రకారం వీరికి ఇక నుంచి రూ.3,250 చెల్లిస్తారు.

జిల్లాలో 146 మందికి ప్రయోజనం
మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచడంతో జిల్లాలో 146 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు ప్రయోజనం కలుగనున్నది. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 60 మంది కార్పొరేటర్లు, బోధన్‌ మున్సిపాలిటీలో 38 మంది కౌన్సిలర్లు, ఆర్మూర్‌ మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లు ఉండగా, భీమ్‌గల్‌ పురపాలక సంఘంలో 12 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

గౌరవంతో పాటు సంతోషం కలిగించే నిర్ణయం
మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల గౌరవ వేతనాలతోపాటు కౌన్సిలర్ల వేతనాలు పెంచడం ఎంతో సంతోషకరం.. వాస్తవానికి గౌరవ వేతనం పెంచారనేదాని కన్నా మా గౌరవాన్ని పెంచినట్లయింది. గతంలో ఏ ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఇంతటి వేతనాలు పెంచలేదని తెలుసుకున్నాను. గౌరవ వేతనాలు పెంచినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.

  • సావిత్రీ గంగాధర్‌గౌడ్‌, 10వ వార్డు కౌన్సిలర్‌, బోధన్‌

కార్పొరేటర్ల, కౌన్సిలర్ల ‘గౌరవం’ పెరిగింది
మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లతో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల గౌరవ వేతనాలను పెంచుతూ సీఎం కేసీఆర్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దీంతో మా గౌరవం పెరిగింది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ప్రజాప్రతినిధులు మరింత ఉత్సాహంతో పట్టణ పాలనా వ్యవహారాల్లో చొరవ చూపేందుకు ఈ గౌరవ వేతనాలు పెంపు దోహదం చేస్తుంది.

  • కొత్తపల్లి రాధాకృష్ణ, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌, బోధన్‌
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement