Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లోని శ్రీ భక్త మార్కండేయ స్వామి శివ పంచాయతన దేవత యంత్ర మూర్తి స్థిర ప్రతిష్ట మహోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. వేద పురోహితులు గంగవరపు ఆంజనేయ శర్మ, రుత్వికుల ఆధ్వర్యంలో నాదస్వరము,శాంతి పాటము గురు ప్రార్ధన, గోపూజ ధ్వజారోహణము, గణపతి పూజ, కలశ స్థాపన పూజ, అగ్ని ప్రతిష్టాపనము, కుటీర శాంతి హోమము తదితర పూజలు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని నలుమూలల నుండి పద్మశాలి సంఘం నాయకులు, కులస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘ ప్రతినిధులు, జిల్లా నాయకులు, మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.