బాన్సువాడ రూరల్ : కారులో నుంచి రూ.2 లక్షలు కాజేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గురువారం బాధితుడి కథనం ప్రకారం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada) మండలంలోని ఇబ్రహీంపేట్ తండాకు చెందిన చందర్ గ్రామంలో కస్టమర్ సర్వీస్ పాయింట్ ( Customer Point ) నిర్వహిస్తున్నాడు. బుధవారం పట్టణంలోని ఎస్బీఐ (SBI) బ్యాంకు నుంచి రూ.రెండు లక్షలు (Two Lakhs) డ్రా చేసి కారులో పెట్టుకున్నాడు.
కొబ్బరికాయలు కొనుగోలు చేయడానికి దుకాణానికి వెళ్లి వచ్చేలోపు కారులోని నగదును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ చోరీలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. బైక్ పై ముగ్గురు వ్యక్తులు బ్యాంకు నుంచి గమనిస్తూ వచ్చి సినీ ఫక్కిలో చోరీ చేశారు. బాధితుడు చందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మండలి అశోక్ తెలిపారు.