Expired pesticides | కోటగిరి : పురుగు మందుల ఎరువులు దుకాణాల దారులు రైతులకు కాలం చెల్లిన మందులు విక్రయిస్తే ఆ దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని కోటగిరి మండల వ్యవసాయ అధికారి టీ రాజు హెచ్చరించారు. కోటగిరి మండల కేంద్రంలో స్థానిక ఎస్సై సునీల్ తో కలిసి పలు పురుగు మందులు, ఎరువుల దుకాణాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు అందించాలని సూచించారు. మందులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. కోటగిరి మండల వ్యవసాయ అధికారి రాజుతో పాటు కోటగిరి ఎస్సై సునీల్ ఉన్నారు.