పోతంగల్ : మండలంలోని కారేగాం (Karegam) శివారులో పునర్నిర్మించిన స్వయంభు మహాదేవ ( Swayambhu Magadeva ) ఆలయం ప్రారంభోత్సవ వేడుకలు మూడు రోజులుగా కన్నుల పండుగగా కొనసాగాయి. ఈనెల 21న మొదలైన కార్యక్రమాలు ఆదివారంన ముగిశాయి.
ఆఖండ నామ స్మరణ, యాగశాల ప్రవేశం, మహ సుదర్శన హోమం,మహా చండీహోమం( ChandiHomam), యంత్ర విగ్రహా ప్రతిష్టా, మహాకుంబాభిషేకం, పుష్పాభిషేకం, వంటి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ సభ్యులు స్వామిజీలను సత్కరించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఆదివారం శ్రీ గణపతి శివలింగ పార్వతి దేవి, నందీశ్వరుడు, దత్తాత్రేయ, మానసా దేవి, పంచముఖి హనుమాన్, ధ్వజస్తంభన, నవగ్రహాలు,అష్టదిక్పాలకులు, శిఖర ప్రతిష్టాపనలు సద్గురు సోమలింగ శివాచార్య స్వామిజీ ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించి, విగ్రహాలను ప్రతిష్టించారు.
కార్యక్రమంలో రావల్ జగద్గురు భీమ శంకరాలింగా శివాచార్య స్వామిజీ, శివానంద్ శివాచార్య స్వామిజీ, మల్లిఖార్జున శివాచార్య స్వామిజీ, సిద్ధి లింగప్ప స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, , కనకమేడల వెంకటరావు, డాక్టర్ వనమాల, మాజీ సర్పంచ్ వెంక గౌడ్, లక్ష్మణ్ , ఈరవంత్ రావు పటెల్, మాకయ్యా, మహిళలు పాల్గొన్నారు.
m,