నిజామాబాద్ : దళితుల జీవితాల్లో వెలుగు నింపడం కోసమే ప్రభుత్వం దళిత బంధును ప్రవేశపెట్టిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేణికుంట నాంపల్లి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలో ఎక్కడలేని విధంగా దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి దళిత బంధును ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ దళితుల పాలిట దేవుడిలా దళితులకు వరాలు కురిపిస్తున్నారని తెలిపారు.
జిల్లా ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటిఆర్, ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడుల్లూరి శ్రీనివాస్, మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ పోసాని, రాష్ట్ర కార్యదర్శి చంద్రయ్య, అధికార ప్రతినిధి రామ్‌చందర్, కిరణ్, లింగయ్య, కృష్ణ, రాములు, గంగాధర్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.