Harsha Toyota | నిజామాబాద్ ఖలీల్ వాడి : నిజామాబాద్ జిల్లాల్లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గుపన్ పల్లి కమాన్ ఎదురుగా లోగ్రామీణ మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నగర కార్పొరేటర్ శశాంక్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవం ఆగస్టు 20, 21, 22వ తేదీల్లో స్పాట్ బుకింగ్ డిస్కౌంట్ రూ.10వేలు ఇవ్వనున్నామని, హర్ష టయోటా ఆధ్వర్యంలో సరసమైన ధరలకు అందిస్తున్నామని తెలిపారు.
కాగా ఈ సందర్భంగా భారీ డిస్కౌంట్లతో కార్లను అమ్మకానికి ఉంచామని, ఈ అవకాశాన్ని నిజామాబాద్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ రెడ్డి, అమిజి త్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, విజయ్ ఆనంద్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ షాకీర్ భాషా, హరీష్, షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.