ఖలీల్వాడి/ ధర్పల్లి, జనవరి 4 : జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ అంధుల ప్రత్యేక పాఠశాలలో మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ, అంధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో లూయీస్ బ్రెయిలీ జయంతిని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు హాజరై మాట్లాడారు. ఫ్రెంచ్ విద్యావేత్త అయిన లూయీస్ బ్రెయిలీ అంధులకు జ్ఞాన కవచాలను ప్రసాదించిన మహానీయుడని అన్నారు.
అనంతరం న్యూఅంబేద్కర్ భవన్లో జిల్లా యువజన, క్రీడల శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి యువజనోత్సవ పోటీలను జడ్పీచైర్మన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఇన్చార్జి మహిళా శిశు సంక్షేమాధికారిణి సుధారాణి, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, రాజేశ్వరిదేవి, ఇందిర, రాజన్న, సాయిలు, యువజన శాఖ అధికారి ముత్తెన్న, బాల్భవన్ పర్యవేక్షకుడు ప్రభాకర్, నాయకులు నీలంరెడ్డి, నాగారావు, జీవన్రావు తదితరులు పాల్గొన్నారు.
ధర్పల్లి మండల కేంద్రంలోని శుభోదయం నైబర్ హుడ్ దివ్యాంగుల సెంటర్లో లూయీ బ్రెయిలీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పాఠశాలలోని దివ్యాంగ విద్యార్థులకు తినిపించారు. వారికి బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. బ్రెయిలీ లిపి ద్వారా కంటిచూపు లేని వారు సైతం ఎలా చదువగలుగుతున్నారో దివ్యాంగ విద్యార్థులకు శుభోదయం ఉపాధ్యాయులు వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెషనల్ స్పెషల్ ఎడ్యుకేటర్ రేణుక, రాధిక, కో-ఆర్డినేటర్ బుచ్చన్న, యాక్టివిస్ట్ నర్సయ్య, సీఆర్పీ స్వప్న తదితరులు పాల్గొన్నారు.