Sirikonda | సిరికొండ, ఏప్రిల్ 2 : పెద్దవాల్గోట్లో మండలంలో పెద్దవాల్గోట్ గ్రామంలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. పెద్దవాల్గోట్ గ్రామంలోని హనుమాన్ మందిరం నుండి శోభాయాత్ర ప్రారంభమైంది. బజరంగబలి విగ్రహాన్ని ట్రాక్టర్లో ఉంచి ఊరేగింపుగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, హనుమాన్ స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని జై హనుమాన్ నినాదాలతో పురవీధులలో భక్తి శ్రద్ధలతో శోభయాత్ర నిర్వహించారు.
హనుమాన్ మాల ధరించిన స్వామి భక్తులు శోభాయాత్రలో ఆట, పాటలతో నృత్యాలు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సర్పంచ్ పిట్లా వనిత నర్సింగ్, చింటు, సంతోష్ రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.