ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 29: నేపాల్‌లో ఈ నెల 28న నిర్వహించిన ఇండో-నేపాల్ యూత్ స్పోర్ట్స్ పోటీల్లో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్వాసి మధు ఇండియా తరపున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. గ్రామానికి చెందిన బోరంచ గణేశ్-చంద్రకళ కుమారుడైన బోరంచ మధు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఏదైనా సాధించాలన్న దృఢసంకల్పంతో రన్నింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించేవాడు.
మండల, రాష్ట్రస్థాయిల్లో పోటీల్లో పాల్గొని విజయం సాధించి ఇండో-నేపాల్ యూత్స్పోర్ట్స్కు ఎంపికయ్యాడు. నేపాల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ స్థాయి రన్నింగ్ పోటీల్లో అరుగురు నేపాల్ క్రీడాకారులు, ఇద్దరు ఇండియా క్రీడాకారులు పాల్గొనగా 100 మీటర్ల పరుగుపందాన్ని 11 సెకండ్లలోనే ముగించి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించాడు. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని మారుమూల గ్రామం నుంచి వచ్చిన దళితముద్దుబిడ్డ నిరూపించాడని గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు.