నిజామాబాద్ : జిల్లాలోని ఎంపీడీవోలు నూతన కార్యవర్గాన్ని ( MPDO Association ) ఎన్నుకున్నారు. డీఆర్డీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో జడ్పీ సీఈవో డి. సాయ గౌడ్ ఎన్నికల అధికారిగా నిర్వహించిన ఎన్నికల్లో సభ్యులు నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సంఘం అధ్యక్షుడిగా గంగుల సంతోష్ కుమార్ ( Gangula Santhoshkumar ) , ప్రధాన కార్యదర్శిగా బీ శ్రీనివాస రావు ( Srinivas Rao), కోశాధికారిగా రాం నారాయణ ( Ramnarayana ) , ఉపాధ్యక్షులు-1 గా నీలవతి, ఉపాధ్యక్షులు-2 గా బీ రాములు నాయక్, జాయింట్ సెక్రటరీగా జీ వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాగ్ నాథ్, పబ్లిసిటీ సెక్రటరీగా సతీష్ కుమార్. ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గా ఏ బాల కిషన్, ఎన్ శంకర్, మతి తిరుమల, రాజా శ్రీనివాస్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు.