Kupriyal | సదాశివనగర్, జులై 10 : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గురువారం అర్ధరాత్రి ముందస్తు సమాచారం మేరకు పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద రూ.2,380 నగదు స్వాధీనం చేసినట్లు తెలిపారు.
అలాగే వారి వద్ద ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జూదం చట్టవిరుద్ధమైన నేరం ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అనుమానాస్పద లేదా చట్టా విరుద్ధ కార్యకలాపాల గురించి సమీప పోలీసులకు సమాచారమందించాలని సదాశివనగర్ ఎస్సై ప్రజలను కోరారు.