నందిపేట్, ఏప్రిల్ 21: డొంకేశ్వర్ మండల పరిధిలోని నూత్పల్లి గ్రామశివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఎలక్ట్రిక్ పోల్‌పై పిడుగు పడి హైటెన్షన్ వైర్ తెగి పడిపోయింది. అదే ప్రాంతంలో సంచరిస్తున్న మూడు నక్కలు తెగిపోయిన విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందినట్లు మండల వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్, అసిస్టెంట్ వెటర్నరీ వైద్యుడు కృష్ణ, డిప్యూటీ రేం జ్ అధికారి సుధాకర్ ఆదివారం తెలిపారు. వాటికి పోస్టుమార్టం అనంతరం దహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.