వినాయక్‌నగర్, అక్టోబర్ 20 : జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ప్రాంతం నుంచి ఓ మహిళను ఆటోరిక్షాలో తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరానికి వచ్చిన ఓ మహిళ శుక్రవారం రాత్రి బస్టాండ్ వద్ద ఒంటరిగా ఉండడంతో ఓ ఆటోవాలా ఆమెను ఆటోలో ఎక్కించుకొని, డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపూర్ ప్రాంతానికి తీసుకువెళ్లి మరో ముగ్గురితో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాపు చేపట్టిన పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని అక్కడ ఆధారాలు సేకరించారు.
నిందితులు డిచ్పల్లి ప్రాంతానికి చెందిన మోసిన్, జైనుద్దీన్, సుల్తాన్, నాగేశ్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, ఆటోరిక్షాతో పాటు బాధితురాలిని తిరిగి నిజామాబాద్‌లో డ్రాప్ చేసేందుకు వినియోగించిన బైక్‌ను సీజ్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో వెల్లడించారు.