మోపాల్ (ఖలీల్‌వాడి), మే 1 : ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మన తరఫున ఢిల్లీలో పోరాడుతారని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. మోపాల్ మండలంలో గ్రామ కమిటీ నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు.
బాజిరెడ్డి గోవర్ధన్ రూరల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.