ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 13 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని పారామౌంట్ గేట్ నంబర్ -1లో బీఆర్ఎస్ అభ్యర్థి మంగపాటి సునీత గోపినాథ్‌కు మద్దతుగా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సోమవారం ప్రచారం నిర్వహించారు.
స్థానిక మహిళలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, కారు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు.