బిచ్కుంద, సెప్టెంబర్ 26: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని జుక్కల్ మాజీ ఎమ్మె ల్యే హన్మంత్ షిండే అన్నారు. శుక్రవా రం బిచ్కుందలోని రజక సంఘంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం షిండే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని, దీని ఫలితం ఐదేం డ్లు అనుభవించాల్సిందేనని ఇప్పుడిప్పుడే వారు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పథకాలన్నీ ఆగిపోయినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో చాలా గ్రామాలకు రోడ్లు వేశామని, వేసిన రోడ్లకే కాంగ్రెస్ నాయకులు మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రోడ్లన్నీ అధ్వానంగా మారాయని, వాటిపై ప్రయాణం చేయాలంటే నరక ప్రాయంగా మారిందన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రైతులు ధైర్యంగా ఉండేవారని, ప్రస్తుతం వారి పరిస్థితి దీనంగా మారిందన్నారు.