బోధన్ రూరల్ : బోధన్ ( Bodhan ) మండలంలోని ఆచన్ పల్లి గ్రామ శివారులో మాజీ ఎమ్మెల్యే షకీల్ ( Shakeel ) జన్మదిన వేడుకలను (Birthday Celebration ) శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గిర్దావర్ గంగారెడ్డి , బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవ్ కుమార్, బీఆర్ఎస్ యూత్ నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేగా బోధన్ నియోజకవర్గంలో గుర్తుండిపోయే అనేక పనులు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామయ్య, కమలాకర్ రెడ్డి, గోపాల్, వినోద్, మోతిరాం,షాకీర్ పటేల్, మేడి రవి తదితరులున్నారు .