బాల్కొండ : బాల్కొండ మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో (SRSP) చేపల వేటకు వెళ్లిన ముప్కల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన జాలరి (Fisherman) బట్టు నడిపి రాజన్న మృతి చెందాడు. బుధవారం సాయంత్రం ఎస్సారెస్పీ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రాంతంలో నడిపి రాజన్న చేపల వేటకు (Fish Hunting) తెప్పలో వెళ్లాడు.
తెప్ప తిరగబడడంతో తాను వేసిన చేపల వలలో చిక్కుకుని బయటకు రాలేక, ఊపిరాడక చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాల్కొండ పోలీసులు వివరించారు. గురువారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.