కమ్మర్పల్లి, జనవరి 4:బాల్రాజు : రాంరాం తాత. ఏం సంగతే లవ్ సంబురంగున్నవ్. ఎవుసం పని యాడ్దాకచ్చె.
నడ్పి రాజన్న : కేసీఆర్ సార్ పైసలు వంపిండు గదనోయ్. పని షురు వెట్టిన. తోటకాడికచ్చి పని మీదికంగిన. గింతల్నే కేసీఆర్ సార్ వంపిన యాసంగి పైసలు వడ్డయ్. గదే జూస్కుంట సంబురమనిపిచ్చింది. కేసీఆర్ సల్లగుండాల.. కేసీఆర్ లేకుంటే గిట్ల పైసలత్తుండెనా అనుకుంటున్న. గదే సంబురమోయ్ తాత. ఏం సంగతోయ్ నీకు వడ్డయా రైతుబంధు పైసల్.
బాల్ రాజ్ : పడ్డయ్పడ్డయ్ తాత. గిది గాదా ఇగో ఫోన్ల కేసీఆర్ సార్ మెసేజ్ అచ్చిందే. గిన్నేండ్ల సంది ఎవుసం జేత్తున్నవ్ గదనే.. మునుపు గిట్ల ఎప్పుడన్న పంట పెట్టుబడి కర్సులకు గవర్నమెంట్ పైసలిచ్చిందానే తాత.
నడ్పి రాజన్న : యాడిదోయ్ బాల్రాజు. గిట్ల ఎప్పుడన్న ఎవుసం జేసేటోల్ల గురించి మునుపట్ల ఆలోచించినోళ్లే లేకుండె. గిట్ల పంట పెట్టుబడి కర్సులకు పైసలిచ్చినోళ్లే లేకుండెనోయ్.
బాల్రాజు : నిజమే తాత. గిట్ల పెట్టుబడికి సుక పైసలిత్తరని ఎవలమన్నా అనుకున్నమానే. మంచి ముచ్చటేందంటే తాత గీ రైతుబంధు పైసలియ్యుమని రైతులము అడుగలేదు సుక. అడుగక ముందే గిట్ల పైసలిత్తున్నడంటే గొప్ప ముచ్చెటనేనే తాత. అగో మల్కాయి రాజన్న తాతత్తున్నడే. తన సుక సంబురం మీద గనిపిత్తున్నడు. దా. దాదా మల్కాయి తాత.
మల్కాయి రాజన్న : ఏమోయ్ బాల్రాజ్ తాత. నడ్పి రాజన్న తాత నువ్వు లవ్ తీరంగ.. లవ్ సంబురంగ ముచ్చట వెడ్తున్నరు.. ఏందో గా ముచ్చట.
నడ్పి రాజన్న : ఏం లేదోయ్ మల్కాయి. కేసీఆర్ సార్ వంపిన యాసంగి రైతుబంధు పైసలు వడ్డయ్ గదే ముచ్చట మాట్లాడుతున్నమ్. మరి నీకు వడ్డయావోయ్.
మల్కాయి రాజన్న : అవ్ పడ్డయ్. సంబుర మనిపిచ్చి పాస్ బుక్కు దీస్కోని గిట్ల తోట మొకాన అచ్చిన. తోట పొంటి రాంగరాంగ లస్మన్న కాక, గంగరెడ్డి కాక, పోతన్న పటేల్ తాత, గా రాజగంగరాం మామ, కొనింటోల్ల పిల్లగాడు సుక గలిసిండ్రు. గాల్లు సుక గిదే రైతు పైసలు వడ్డ సంబురంల గట్టు మీదోల్ల తోట కాడ ముచ్చట వెడ్తున్నరు.
బాల్రాజు : కరెక్టే గద మల్కాయి తాత. రైతుబంధు పైసలు వడ్డయంటే ఓల్లకన్న సంబురమే ఉంటది గదా. తిప్పలు లేని కరెంటు ఇచ్చె. మోటార్లు గాలి పోవుడు బందై పాయె. మందులకు తిప్పలు లేకుంట జేసె. ఆనకాలం పంటకు, యాసంగి పంటకు టైంకు కర్సులకు పైసలు వంపవట్టె. కిస్మత్ మంచిగ లేక రైతుకాలం జేత్తె ఐదు లక్షల రూపాలియ్య వట్టె. గిట్ల రైతుల కోసం మన దగ్గర కేసీఆర్ సారు జేత్తున్నట్టు దేశంల ఏ జాగలన్న ఎవరన్న జేత్తున్నర. ఎవ్వరు సుక జేత్తలేరు. గందుకనే తోటల కాడ రైతుబంధు సంబురం గనిపిత్తది.