ఎడపల్లి, నవంబర్ 20: మానవత్వం మంటగలుస్తున్నది. కూతురుపైనే తండ్రి లైంగిక దాడిచేసిన దారుణ ఘటన వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఎడపల్లి మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన 15 ఏండ్ల కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈనెల 17వ తేదీన రాత్రి మరోసారి లైంగిక దాడికి పాల్పడుతుండగా.. బాలిక తల్లి అడ్డుకున్నది. దీంతో ఆమెను చంపుతానని బెదిరించాడు. ఈ విషయమై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి పోలీసులు తెలిపారు.