వేల్పూర్, ఆగస్టు 11: రైతున్నలను యూరియా కష్టాలు వీడడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్లో యూరియా బస్తాల నమోదుతో తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం ఏర్పాటు చేసిన యాప్‌లో బస్తాల కోసం నమోదు చేసుకున్నప్పటికీ గోదాముకు వెళ్లేసరికి యూరియా దొరుకుతుందన్న గ్యారంటీ లేకుండా పోయింది.
దీంతో రైతులు ఉదయం నుంచి గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని అమీనాపూర్ గ్రామంలో యూరియా కోసం మంగళవారం ఉదయం 6 గంటల నుంచే వేచి ఉన్నారు. బస్తాల కోసం తమ వద్ద ఉన్న పాస్‌బుక్‌లను క్యూలో ఉంచారు. యూరియా కోసం తిప్పలు తప్పడం లేదని, పాత విధానంలోనే యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.