రుణమాఫీ విషయంలో శనివారం వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో రైతుల అనుమతితో సీఎం రేవంత్‌రెడ్డికి లేఖను పంపిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. ఆ లేఖను ధర్నాలో రైతులకు చదివి వినిపించారు.
-మోర్తాడ్, ఆగస్టు 17
మోర్తాడ్, ఆగస్టు 17 : బ్యాంకులకు వెళ్తే లిస్టులో పేరు చూసుకొని పొండ్రి అంటుండ్రు. మమ్మల్ని సతాయించకుండ్రి అంటుండ్రు. నాకు బ్యాంకులో రూ.2.20లక్షల రుణం ఉన్నది. రూ.2లక్షల రుణం ఆగస్టు 15 వరకు ఇస్తామని సీఎం చెప్పడంతో మూడో దఫా లిస్టుకోసం ఎదురు చూశాను. కానీ మూడో లిస్టులో కూడా పేరు రాలేదు. ఎందుకు రాలేదో తెలియడం లేదు. రుణమాఫీ వస్తుందా రాదా అనే విషయం అనుమానంగా ఉన్నది. కుటుంబానికి ఒకరికి రూ.2లక్షల రుణమాఫీ ఇస్తామన్నారు.
– దుగ్గెన రాజేందర్, రైతు, ధర్మోరా
నాకు రూ.1.40లక్షలు, నా భార్యకు రూ.లక్ష రుణం ఉన్నది. మూడు విడుతలో కూడా మాకు రుణమాఫీ రాలేదు. బ్యాంకులోకి వెళ్లి అడిగితే రాలేదని చెప్తుండ్రు. ఇద్దరికీ కలిపి రెండు లక్షల రుణమాఫీ ఇస్తారని అనుకున్న. మూడు విడుతలు అయిపోయినాయి.. ఇంకా ఇస్తరో ఇయ్యరో అనుమానమే.
– నాగిరెడ్డి రాజరెడ్డి, రైతు, దోంచంద
వేల్పూర్, ఆగస్టు 17 : గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ ప్రభు త్వం షరతులతో కూడిన రుణమాఫీ చేస్తున్నది. ఇది సరైంది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలి.
– జైడి గంగారెడ్డి, మోతె, వేల్పూర్