బీబీపేట్, ఆగస్టు 21: రుణమాఫీపై అన్నదాతలకు వెతలు తప్పడం లేదు. రేషన్ కార్డులో పేరు లేదు.. మొదట వడ్డీ చెల్లించా లి.. రూ.రెండు లక్షల కన్నా ఎక్కువ లోన్ ఉన్నది.. ఆధార్ కార్డు నంబర్ తప్పుగా ఉన్నది.. అంటూ అధికారుల నుంచి రకరకాల కొర్రీలు, కుంటి సాకులు ఎదురవుతున్నాయి. అర్హులమైన తమకూ రుణమాఫీ చే యాలంటూ మొదటి విడుత నుంచి మూడో విడుత ముగిసినా అధికారులు, బ్యాంకుల చుట్టూ రైతుల చక్కర్లు తప్పడం లేదు.
తిరిగీతిరిగి చెప్పులరుగుతున్నాయే తప్ప.. రుణమాఫీ జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంతోపాటు మాందాపూర్, జనగామ, యాడారం, మాల్కాపూర్, ఉప్పుర్పల్లి, ఇస్సానగర్, తుజాల్పూర్ తదితర గ్రామాల్లో రూ. రెండు లక్షల వరకు రుణాలు మాఫీ జరగలేని రైతులంతా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ. 2లక్షల వరకు ఎలాంటి నిబంధనలు లేకుండా మాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నేను గతంలో రూ. 20 వేలు బ్యాంక్‌లో పంట రుణం తీసుకున్న. మిత్తితో కలిపి మొత్తం రూ. 64 వేలు అయ్యిం ది. మొదటి విడుతలోనే రుణమాఫీ కావా ల్సి ఉన్నది. కానీ రేషన్‌కార్డులో పేరు లేకపోవడంతో మాఫీ కాలేదని ఏఈవో చెప్పిండు. రుణమాఫీ చేస్తామని ఆశ చూపి మోసం చేయడం ఎంత వరకు కర్టెక్. వెంటనే రుణమాఫీ చేయాలి.
– దోనెపల్లి సురేశ్, రైతు, జనగామ
ప్రభుత్వం చేసిన రుణమాఫీ అంతా గందరగోళంగా ఉన్న ది. నాకు మొత్తం రూ.2లక్షల40వేల వరకు మిత్తితో కలిపి బ్యాంకులో లోన్ ఉన్న ది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షలైనా రుణమాఫీ చేయాలి. కానీ రెండు లక్షల కన్నా ఎక్కువగా రుణం ఉన్నదనే కారణంతో రుణమాఫీ కాలేదని చెబుతుండ్రు. పైనుంచి లిస్టులో పేరు వస్తేనే మాఫీ అవుతుందని ఆఫీసర్లు చెప్పిండ్రు.
పెద్ద బలమాల్లు,
– మాల్కాపూర్ రైతు
మూడో విడుత జాబితాలో నా పేరు లేదు. ఎందు కు రుణమాఫీ కాలేదని రైతువేదికలో ఏఈవోను అడిగితే మీ కుటుంబంలో మొత్తం రూ.2లక్షల 13వేల వర కు రుణం ఉన్నది. అందుకే మూడో విడుతలో రుణమాఫీ కాలేదని చెప్పిండు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలి.
– సదాల బలరాములు, రైతు, మాందాపూర్