ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ దాడులు
జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత మత్తుపదార్థాల రవాణా చేయడంతోపాటు నిల్వ చేయడం, విక్రయాలు చేస్తున్న వారిపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సోమవారం దాడి చేశాయి. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
- రూ. 25 లక్షల విలువ చేసే ఆల్ఫ్రాజోలం, క్లోరల్ హైడ్రేట్ స్వాధీనం
- ఐదుగురు నిందితుల అరెస్టు.. పరారీలో మరో ముగ్గురు
వినాయక్‌నగర్, మే 6 : జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత మత్తుపదార్థాల రవాణా చేయడంతోపాటు నిల్వ చేయడం, విక్రయాలు చేస్తున్న వారిపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సోమవారం దాడి చేశాయి. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మూడు టీములతో వివిధ ప్రాంతాల్లో దాడులు చేసినట్లు తెలిపారు. దాడుల్లో గొల్లపల్లి యాదగిరిగౌడ్, తాటికొండ నర్సయ్య, గడ రాజేశ్‌కుమార్, సుప్పని నవీన్‌కుమార్ గౌడ్, షేక్ హుస్సేన్ ఐదుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ. 25 లక్షల విలువ చేసే 2.32 కిలోల ఆల్ఫ్రాజోలంతో పాటు 0.530 గ్రాముల క్లోరల్ హైడ్రేట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరితోపాటు మత్తుపదార్థాల విక్రయాలతో సంబంధం ఉన్న మరో ముగ్గురు చెగ్గారి రాజేందర్ గౌడ్, చేవూరి నాగరాజు గౌడ్, నెమోడి శంకర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని, పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్‌హాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు చంద్రభానునాయక్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు పి.స్వప్న, ఏ.వెంకటేశ్, ఎస్సై నర్సింహాచారి, సిబ్బంది నారాయణరెడ్డి, భోజన్న, రాంబచన్ తదితరులు దాడుల్లో పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ విజేత నల్లగొండ జట్టు
Health tips | రోజుకో బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

