పెద్ద కొడప్గల్ (పిట్లం) : కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మార్దండ (Marthanda) గ్రామంలో శుక్రవారం మహిళ గ్రామ సంఘం ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. గ్రామంలోని 24 మహిళా సంఘాల సభ్యులు నూతన గ్రామ సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా వాసరి సావిత్రి (Vasari Savitri) ,కార్యదర్శిగా వాసరి విజయ, కోశాధికారి దయ్యాల అంబవ్వ, ఉపాధ్యక్షురాలు మున్నూరు శోభ, సహాయ కార్యదర్శి రొట్టెల రత్నవ్వ ను సంఘ సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సీసీ ఉత్తమ్,వీవోఏ రవీందర్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.