మోర్తాడ్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ (Morthad) మండలం తుంకేట్ గ్రామ శివారులోని చిన్నచిన్న వాగుల నుంచి గత కొన్ని రోజులుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. బుధవారం కూడా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు రాత్రి పోలీసులు నిఘా పెట్టి రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నందున ట్రాక్టర్లను సీజ్ (Tractors Seize) చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రం తెలిపారు. మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .