నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 27 : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాదిలో నేరాల నియంత్రణకు పోలీసు శాఖ తీవ్రంగా కృషి చేసిందని సీపీ నాగరాజు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, డీజీపీ మహేందర్ రెడ్డి సూచనల ప్రకారం ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువగా ఉంటూ నేరాలను అదుపు చేసేందు కు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లోని ప్రశాంతి నిలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాది ఇప్పటి వర కు నమోదైన నేరాలు, వాటి వివరాలను సీపీ వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో కేసులు నమోదు చేసి, ఫైన్లు విధించడంలో రాష్ట్రంలోనే మన జిల్లాకు మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. మట్కా, గ్యాంబ్లింగ్‌ను అరికట్టడం లో సైతం గత రెండేండ్ల కన్నా ఈ ఏడాది ఎక్కువ మం దిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నా రు.
గుట్కా అక్రమ రవాణాతో పాటు గంజాయి స్మగ్లింగ్‌పై కేసులు నమోదు చేసి నిందితులకు శిక్ష పడేలా ని జామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల ఏసీపీలతో పాటు సీసీఎస్ టీమ్ సైతం తీవ్రంగా శ్రమించినట్లు తెలిపారు. గత రెండేండ్లతో పోలిస్తే ఈ ఏడాది చైన్‌స్నాచింగ్ కేసులు సైతం తగ్గుముఖం పట్టాయని అన్నారు. అంతే కాకుండా రోడ్డు ప్రమాదాలను నియంత్రించామని, మృ తుల సంఖ్య సైతం తగ్గిందని తెలిపారు. మహిళల పై జరుగుతున్న వేధింపులను అరికట్టడానికి ప్రత్యేకంగా ‘షీ టీమ్స్’ను రంగంలోకి దించామన్నారు. జిల్లా వ్యా ప్తంగా మైనర్లపై అఘాయిత్యాలు జరగడం వలన ఫోక్సో కేసులు ఎక్కువగా నమోదైనట్లు సీపీ వివరించారు. ఈ ఏడాది 291 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా 320 మృత్యువాత పడ్డారు. వరకట్న వేధింపు కేసులు 340 నమోదయ్యాయి. మర్డర్ ఫర్గైన్ 10, దోపిడీ కేసు 1, రాబరీ కేసులు 16, రాత్రి దొంగతనాలు 214, పగ టి చోరీలు 27, చైన్‌స్నాచింగ్‌లు 22, ట్రాన్స్ఫార్మర్స్ కా యిల్స్ చోరీలు 87, వాహనాల చోరీ 417, ఇతర దొంగతనాలు 228 నమోదయ్యాయి.
దోపిడీ దొంగతనాల్లో రూ.6 కోట్ల75లక్షల 54వేల 285 సొత్తు చోరీకి గురి కాగా రూ.2 కోట్ల 22 లక్షల 4వేల 897 (32.86 శా తం)రికవరీ చేశారు. వరకట్నం మృతి కేసులు 4, ఈవ్‌టీజింగ్40, మహిళలపై వేధింపులు 550, ఫోక్సో కేసు లు 71, ఈ-చలాన్ కేసులు 3,88,374 (రూ. 12 కోట్ల 30 లక్షల 95 వేల 500 జరిమానాలు), 384 పే కాట కేసుల్లో 1939మందిని అరెస్టు చేసి రూ. 56, 55,477 ఫైన్ విధింపు. 47మట్కా కేసుల్లో 80 మం దిని అరెస్టు చేసి రూ.4లక్షల 92వేల 646 నగదు సీజ్ చేశారు. 19 గంజాయి స్మగ్లింగ్ కేసుల్లో 272.761 కేజీ ల గంజాయి సీజ్ చేశారు. జాతీయ లోక్‌అదాలత్ ద్వా రా జిల్లా వ్యాప్తంగా 19,110 కేసుల్లో రాజీ కుదిర్చారు.
వివిధ కేసుల్లో నిందితులకు ఖరారైన శిక్షలు : ఆరుగురికి జీవిత ఖైదుతో పాటు ఇద్దరికి 20 సంవత్సరాల జైలు, 8 మందికి 10 సంవత్సరాలు, ఒకరికి ఏడు సంవత్సరాలు, ఒకరికి 6 సంవత్సరాలు, ఆరుగురికి 5 సంవత్సరాలు, ఒకరికి 4 సంవత్సరాలు, ఐదుగురికి 3 సంవత్సరాలు, నలుగురికి 2 సంవత్సరాలు, 24 మంది నిందితులకు ఏడాది, 46 మందికి ఏడాదిలోపు శిక్షలు విధించారు. మైనర్ల మిస్సింగ్ కేసులు 56 కేసులు నమోదు చేయగా 52 మందిని గుర్తించారు. కమిషనరేట్ పరిధిలో షీ టీముల ద్వారా 86 అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. మొత్తం 67 ఈవ్‌టీజింగ్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో 92 మందిని అరెస్టు చేసి 27 పెటీ కేసులు,5 ఎఫ్ఐఆర్లు చేయడంతో పాటు 35 మంది మైనర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సమావేశంలో నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్, బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీశైలం, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో డి.విజయ్‌బాబు, సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్‌తో పాటు సీసీఆర్బీ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.