సిరికొండ : అమెరికాలో ఉన్న భారతీయులను వెనక్కి పంపుతున్న చర్యను నిరసిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను ( Trump Effigy ) దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ ( Sirikonda) మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీపీఐ ఎంఎల్ (CPI ML) ప్రజాపంథా మాస్ లైన్ మండల నాయకుల ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మండల నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న నేపంతో భారతీయుల( Indians) కాళ్లకు, చేతులకు బేడీలు వేసి కనీస సౌకర్యాలు లేని ఫ్లైట్ లో పంపించి దుర్మార్గానికి ఒడి కట్టాడని ఆరోపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) ఖండించకపోవడం దారుణమని ఆరోపించారు. నైపుణ్యం ఉన్న భారతీయుల వల్లే అమెరికా అత్యున్నత స్థానంలో ఉందన్న విషయాన్ని ట్రంప్ మర్చిపోయాడని అన్నారు.
ప్రధాని త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లడం వెనుక అమెరికాకు మద్దతు ఇచ్చే విధంగా ఉందని విమర్శించారు.అమెరికాలో ఉన్న భారతీయులకు అండగా నిలబడి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ మండల నాయకులు కిషోర్, లింబాద్రి, మండల నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.