కామారెడ్డి, ఫిబ్రవరి 12: కామారెడ్డి ప్రభుత్వ దవాఖాన ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ రాంసింగ్‌ను సోమవారం నియమించారు. కామారెడ్డి వైద్య కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ రాంసింగ్‌ను నియమిస్తూ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు నియామకపత్రాన్ని అందజేశారు.
డాక్టర్ రాంసింగ్ సోమవారం డాక్టర్ విజయలక్ష్మి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రోగిని ఎలుక కరిచిన ఘటనలో డాక్టర్ విజయలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే.