ఆర్మూర్ : రిజర్వేషన్ల వాటా తేలే వరకు గ్రూప్ ఫలితాలు (Group Results ) విడుదల చేయవద్దని ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకుడు బాలు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి మైలారం బాలు ఆధ్వర్యంలో నాయకులతో నల్ల బ్యాడ్జీలు ధరించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
బాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు ( Reservations) ప్రకటించిన తరువాతే గ్రూప్ ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫలితాలు విడుదల చేస్తే మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.