మోర్తాడ్ : మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్ (Lions Club) మోర్తాడ్ వారి ఆధ్వర్యంలో పరీక్షా అట్టలు(Exam Pads) , పెన్నులు, పెన్సిళ్ల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మోర్తాడ్ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించి మోర్తాడుకు మంచి పేరు తీసుకురావాలని కోరారు . ఈ కార్యక్రమంలో సంజీవ్, శ్రీనివాస్, నజీర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.