నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 15 : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా 19 ఏండ్లలోపు పిల్లలకు అల్బెండజోల్ వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. కోటగిరి మండలంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, హైస్కూల్, కేజీబీవీల్లో విద్యార్థులకు పొతంగల్ పీహెచ్సీ డాక్టర్ కరణ్ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోటగిరి సీహెచ్‌సీ డాక్టర్ అద్నాన్, హెల్త్ సూపర్వైజరు ్లకృష్ణవేణి, జ్యోతి, సాయికుమారి పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని కసాబ్‌గల్లీ జీజీహెచ్‌ఎస్‌లో డీఎంహెచ్‌వో సుదర్శనం అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.
డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిరికొండలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ తుకారాం రాథోడ్ నులి పురుగుల నివారణ మాత్రలను అందజేశారు. నులిపురుగుల నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా పబ్లిక్ హెల్త్ నర్సు స్వామి సులోచన వివరించారు. వైద్యుడు వెంకటరవి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రవిఠల్, సిరికొండ మండల వైద్యాదికారి మోహన్, సీహెచ్‌వో అనంతరావు, వైద్యురాలు నవ్య, ప్రిన్సిపాల్ సునీత పాల్గొన్నారు.
ధర్పల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యశాఖ సూపర్వైజర్లు రాజేందర్, నిర్మల, దుబ్బాక సర్పంచ్ వెంకటేశ్ నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. దుబ్బాకలోని శ్రీవిద్య పాఠశాలలో సైతం అల్బెండజోల్ మాత్రలు అందజేశారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం నారాయణ, శ్రీవిద్య స్కూల్ కరస్పాండెంట్ సాయికృష్ణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
చందూర్ మండలకేంద్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఎంపీడీవో నీలావతి, సర్పంచ్ సాయారెడ్డి విద్యార్థులకు నట్టల నివారణ మాత్రలను పంపిణీ చేశారు.
రుద్రూర్‌లోని జేఎన్సీ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జడ్పీటీసీ సభ్యుడు నారోజి గంగారాం అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముజీబ్, డాక్టర్ దిలీప్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, వైస్ ఎంపీపీ సాయిలు, ఎంఈవో శాంతకుమారి, సంజీవ్, గ్రామాధ్యక్షుడు గంగారాం పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలంలోని తిర్మన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్, ఆరోగ్య విస్తరణ అధికారి శంకర్, పబ్లిక్ హెల్త్ నర్స్ ఎలిజబెత్ అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. నవీపేట, బినోల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వైద్యాధికారిణి నవ్య, మోర్తాడ్‌లో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉషారాణి విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేశారు. విద్యార్థులు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని వేల్పూర్ మండలం మోతె గ్రామంలోని విజ్ఞాన్ పాఠశాల హెచ్ఎం హరీశ్ కోరారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణపై డిప్యూటీ డీఎంహెచ్‌వో సమత అవగాహన కల్పించారు. ఆమెవెంట జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపర్వైజర్ నిర్మల, రవికుమార్ తదితరులున్నారు. రెంజల్ మండల కేంద్రంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీని డాక్టర్ ప్రతిమ ప్రారంభించారు. ముప్కాల్ మండల కేంద్రంతోపాటు వేంపల్లి, రెంజర్ల, నల్లూర్, వెంచిర్యాల్, కొత్తపల్లి, నాగంపేట్ గ్రామాల్లో 19 ఏండ్ల లోపు వారికి వైద్యసిబ్బంది అల్బెండజోల్ మాత్రలు వేశారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో నులిపురుగుల నివారణ మాత్రలను డాక్టర్ స్వామి పంపిణీ చేశారు. బోధన్ మండలం మందర్నాలో పిల్లలకు సర్పంచ్ గంగాధర్ నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు.