భీమ్‌గల్, డిసెంబర్ 7: మంత్రి ప్రశాంత్‌రెడ్డి కృషితో బాల్కొండ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ సెంటర్‌ను మంజూరు చేసింది. భీమ్‌గల్ ప్రభుత్వ దవాఖానలో ఐదు బెడ్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డయాలసిస్ సెంటర్ మంజూరుపై నియోజకవర్గ ప్రజలతోపాటు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసన సభా వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో భాధపడుతున్న నియోజకవర్గ పరిధిలోని పేద ప్రజలకు ఈ డయాలసిస్ సెంటర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కిడ్నీ బాధితులు ఇకనుంచి నిజామాబాద్, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఏకకాలంలో ఐదుగురికి డయాలసిస్ చేసే అవకాశం ఉందన్నారు. డయాలసిస్ సెంటర్‌ను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.