ధర్పల్లి, డిసెంబర్ 25: మండల కేంద్రంలోని పెద్దచెరువు నుంచి ఆయకట్టుకు నీటి విడుదలను ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు, ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్.. ఎంపీపీ నల్ల సారికా హన్మంత్‌రెడ్డితో కలిసి ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతన్నల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమ బాధ్యత తమదని అన్నారు. సారవంతమైన నేల దెబ్బతిన్నకుండా రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులను వాడాలని రైతులను కోరారు. చెరువు నీటి విడుదల ద్వారా ధర్పల్లి, సీతాయిపేట్‌కు చెందిన ఆయకట్టు కింద 500 ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపారు.
అనంతరం చెరువు కట్ట, గంగమ్మ గుడి వెనుక వైపు సీతాయిపేట్ గ్రామం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యులు, మండల కన్వీనర్ పీసు రాజ్‌పాల్‌రెడ్డి, ధర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్‌రాజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి గోపాల్‌నాయక్, పార్టీ మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు హన్మంతోళ్ల వెంకట్‌రెడ్డి, సురేందర్‌గౌడ్, ఎస్పీ లింగం, లొక్కిడి రాములు, నజీర్, బద్దం నడ్పి గంగారెడ్డి, పోతరాజు, బుజ్జన్న, తండా సర్పంచ్ లింబ్యానాయక్, సీతాయిపేట్ ఉపసర్పంచ్ నిషాంత్, కేసీఆర్ సేవాదళ్ రూరల్ కన్వీనర్ కోర్వ రాజేందర్ పాల్గొన్నారు.