
Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో సోమవారం మల్లికార్జున స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం అగ్నిగుండాలు అఖండ దీపారాధన, గణపతి గౌరీ పూజ, స్వస్తి పుణ్యా వచనం, మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గుడిమెట్ పీఠాధిపతి సద్గురు మహాదేవ స్వామి హాజరై భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు హిందూ ధర్మాన్ని కాపాడడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతీరోజు స్నానం చేసిన తర్వాత బొట్టును ధరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.