కామారెడ్డి, డిసెంబర్ 8 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ జితేశ్ పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో 22 మంది జడ్పీటీసీలు పాల్గొనాల్సి ఉండగా 11 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 55 అంశాలను ఎజెండాలో చేర్చారు. 12 గంటలకు ప్రారంభమైన సమావేశం 45 నిమిషాల్లోనే ముగిసింది.55 అంశాల్లో డీఆర్డీవో, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మత్స్య, పశువైద్య, వ్యవసాయ శాఖలపై చర్చ జరిగింది.