బాన్సువాడ : బాన్సువాడ నియోజక వర్గంలో ని బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్ కమలాకర్ రెడ్డి మాతృమూర్తి రెండు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందింది. శుక్రవారం స్వగ్రామమైన దామరంచ లో అంత్యక్రియలు జరిగాయి. శనివారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల డీసీసీబీ(DCCB) చైర్మన్ రమేష్ రెడ్డి ( Ramesh Reddy) , సభ్యులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజిరెడ్డి, క్రాంతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపాల రెడ్డి ఉన్నారు.