కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో (Kotagiri mandal ) మహాశివరాత్రి ( Mahashivratri ) పురస్కరించుకొని బుధవారం మండలంలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శివలింగానికి అభిషేకాలు. పత్రితో పూజలు నిర్వహించారు.
మండలంలోని అడ్కస్ లింగమయ్య (Lingamaiah Temple), కోటగిరిలోని మక్త శివాలయం (Makta Shivalayam), పోచారం కాలనీలోని శ్రీ అభయ బసవేశ్వర శివాలయం లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా బుధవారం ఉపవాసం ఉన్న భక్తుల కోసం గురువారం శివాలయం వద్ద అన్నదానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
పండ్ల ధరకు రెక్కలు
మహాశివరాత్రి పండుగ సందర్బంగా వివిధ రకాల పండ్ల (Fruits ) ధరలు పెరిగాయి. ఉపవాసం ఉన్న భక్తులు పండ్లను కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. వ్యాపారులు దీనిని ఆసరా చేసుకొని పండ్ల ధరలను విఫరీతంగా పెంచేశారని కొనుగోలుదారులు వాపుతున్నారు. రెండు రోజుల క్రితం పండ్లకు ఉన్న ధరలు నేడు రెండింతలు పెరిగాయని కొనుగోలు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరటిపండ్లు డజన్ రూ. 30 ఉండగా మార్కెట్ లో రూ 60-80 పలుకుతుందని వాపోతున్నారు. ద్రాక్ష, సపోటా, దానిమ్మ ఇతర పండ్ల ధరలను గణనీయంగా పెంచి విక్రయిస్తున్నారు.