హైదరాబాద్ : బీఆర్ఎస్లోకి(BRS) వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసి పలువురు గులాబీ గూటికి చేరుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకుడు మీసాల శ్రీనివాస్‌తో పాటు పలువురు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. బీఆర్ఎస్ పార్టీలోనే కార్యకర్తలకు నిజమైన గుర్తింపు ఉంటుందన్నారు.
పార్టీ అభివృద్ధి కోసం అందరు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో
దుంపల శ్రీను, కొండూరు గంగాధగ్, ఈరోళ్ల ప్రవీణ్, ఎర్రోళ శ్రీనివాస్, ముత్యం రాకేష్, రాజేశ్వర్, డప్పు సాయి, మెండే గంగాధర్, సున్నపు భాస్కర్, మీసాల నవీన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గున్నాల భగత్ గొల్లపల్లి సురేష్, మందుల చంటి పాల్గొన్నారు.