ఆర్మూర్‌టౌన్,జనవరి 30: ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నాకు ఇన్చార్జి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తూ మైనార్టీ కౌన్సిలర్లు, యువకులు, మహిళలు నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన ఈ దీక్షలు మంగళవారం మూడోరోజుకు చేరుకోగా ఈ సందర్భంగా మైనార్టీ కౌన్సిలర్లు మాట్లాడారు.
ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గి 26 రోజులు కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రభు త్వం తన వైఖరిని మార్చు కోవా లని , వైస్ చైర్మన్ మున్నా కు ఇన్చార్జి చైర్మన్ బాధ్యతలు ఇ వ్వాలని వారు డిమాండ్ చేశారు.