Kotagiri | కోటగిరి, జూన్ 21 : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకొని కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమాల్లో కోటగిరి, పొతంగల్ మండలాల బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్ నజీర్, సమీర్ తో పాటు పలువురు జయశంకర్ సార్ చేసిన పోరాటాలు, ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.