కంఠేశ్వర్, మే 3 : జిల్లాలో నేడు నిర్వహించనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 3,398 మంది పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో 4, డిచ్పల్లి, బోధన్‌లో రెండు చొప్పున మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
నిర్ణీత సమయం దాటిన తర్వాత అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో లోనికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వబోరని స్పష్టం చేశారు. కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని పేర్కొన్నారు. పరీక్షకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం ఐడీవోసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 99121 92692, 98859 75254 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.