డుమ్మా డాక్టర్లపై చర్యలు
ప్రభుత్వ దవాఖానల్లో విధులకు హాజరుకాని వైద్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు.
- డీఎంహెచ్‌వోకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశం
బోధన్, జూలై 12: ప్రభుత్వ దవాఖానల్లో విధులకు హాజరుకాని వైద్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. వర్నిలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఆరాతీశారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఆరోగ్యమేళాలో మధుమేహం, రక్త పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై వైద్యసిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యసిబ్బంది హాజరుపట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా దవాఖానకు వైద్యులు సక్రమంగా రావడంలేదని కొందరు ఫిర్యాదుచేయగా ..దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి తుకారాం రాథోడ్‌ను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలపై రోగులు, ప్రజల్లో నమ్మకం పెంచాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ఉన్నత పాఠశాలల తనిఖీ
వర్నిలోని సత్యనారాయణపురం బాలికల జడ్పీ హైస్కూల్, మండలంలోని శ్రీనగర్ జడ్పీ హైస్కూల్ కలెక్టర్ సందర్శించి అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఈవో దుర్గాప్రసాద్, అధికారులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
US Hindu Temple: అమెరికా గుడిలో కాల్పులకు ప్లాన్.. గన్ జామ్ కావడంతో తప్పిన ముప్పు.. టీనేజర్ అరెస్టు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

