e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 25, 2022
Home కామారెడ్డి మంత్రి వేముల సహకారంతో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు మంజూరు

మంత్రి వేముల సహకారంతో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు మంజూరు

ఏర్గట్ల, డిసెంబర్‌ 6: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరయ్యాయని ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం అన్నారు. మండలంలో పలువురికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో వారు లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు జక్కని మధుసూదన్‌, పార్టీ గ్రామ అధ్యక్షుడు తుపాకుల శ్రీనివాస్‌ గౌడ్‌, ఆయా గ్రామాల సర్పంచులు, సొసైటీ చైర్మన్లు పెద్దకాపు శ్రీనివాస్‌రెడ్డి, బర్మ చిన్ననర్సయ్య, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ సున్నపు అంజయ్య, జిల్లా సభ్యుడు లింగారెడ్డి, లిఫ్ట్‌ చైర్మన్‌ సత్యంరెడ్డి, మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షుడు జైనుద్దీన్‌, ఉపసర్పంచ్‌ సున్నపు గంగయ్య, పార్టీ నాయకులు బాలాజీ గౌడ్‌, బద్దం ప్రభాకర్‌, రాజగంగారాం, ఏసల నర్సారెడ్డి, రొక్కెడ మోహన్‌, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

ఐదు గ్రామాల్లో చెక్కుల పంపిణీ..
భీమ్‌గల్‌ మండలంలోని బెజ్జో రా, పురాణీపేట్‌, బాబాపూర్‌, గోన్‌గొప్పుల, చేంగల్‌లో పలువురికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు పంపిణీ చేశారు. ఎంపీపీ ఆర్మూర్‌ మహేశ్‌, జడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు మోయిజ్‌, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు కవితా గంగాధర్‌, సొసైటీ చైర్మన్‌ శివసారి నర్స య్య, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

రామచంద్రాపల్లిలో..
మాక్లూర్‌ మండలంలోని రామచంద్రాపల్లి గ్రామానికి చెందిన శ్వేతకు రూ.30వేలు, లింగయ్యకు రూ.64వేలు, రాజమణికి రూ.12,500, గంగామణికి రూ.13వేల విలువైన చెక్కులను టీఆర్‌ఎస్‌ నాయకులు అందజేశారు. సర్పంచ్‌ కటకం వెంకన్న, టీఆర్‌ఎస్‌ యూత్‌ సెల్‌ మండల అధ్యక్షుడు భూషణ్‌, ఎంపీటీసీ పెద్దులు, నాయకులు బుర్రె సాయన్న, మహేశ్‌ పాల్గొన్నారు.

పేద కుటుంబాలను ఆదుకుంటున్న సీఎంఆర్‌ఎఫ్‌..
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 36 మందికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎంపీపీ శివలింగు శ్రీనివాస్‌, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కల్లెడ ఏలియా సోమవారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ కల్లెం అశోక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ మోత్కు భూమన్న, సర్పంచులు భోగ ధరణి, గడ్డం చిన్నారెడ్డి, మండల రాజేశ్వర్‌, సంతోష్‌, వెల్మ రూప, ఎంపీటీసీలు రాజ్‌పాల్‌, శ్రీనివాస్‌, అశోక్‌, సొసైటీ ఉపాధ్యక్షుడు దడివె నవీన్‌, నాయకులు సుమన్‌, ఓరగంటి రమేశ్‌, అజారుద్దీన్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement