నాగిరెడ్డిపేట్/ లింగంపేట్/ నిజాంసాగర్/ పిట్లం/ తాడ్వాయి/ బాన్సువాడ రూరల్/ బీర్కూర్/ బీబీపేట్/ రాజంపేట, ఏప్రిల్3: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. నాగిరెడ్డిపేట్ మండలంలో నిర్వహించిన పరీక్షా కేంద్రాల్లో 327 మందికి 325 మంది పరీక్ష రాయగా ఇద్దరు గైర్హాజరైనట్లు ఎంఈవో వెంకటేశం తెలిపారు. లింగంపేట్ మండలంలో 453 మందికి 452 మందికి హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఎంఈవో రామస్వామి చెప్పారు. పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్కాడ్ బలరాం, ప్రతాప్, తహసీల్దార్ చంద్రరాజేశ్ తనిఖీ చేశారు. నిజాంసాగర్ మండలంలో 475 మందికి 475 విద్యార్థులు పరీక్ష రాసినట్లు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు అమర్‌సింగ్, శ్రీరాం, నాగవేందర్ తెలిపారు. తహసీల్దార్ నారాయణ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పిట్లం మండలంలో 540 మందికి 537 మంది హాజరు కాగా ముగ్గురు విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎంఈవో దేవీసింగ్ తెలిపారు. తాడ్వాయి మండలంలో 471 మందికి 470 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఎంఈవో రామస్వామి పేర్కొన్నారు.
బాన్సువాడ మండలంలో 1,039 మందికి 1,032 మంది పరీక్షలు రాయగా ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎంఈవో నాగేశ్వర్రావు తెలిపారు. బీర్కూర్‌లో 242 మందికి అందరూ హాజరైనట్లు పరీక్షల ఇన్చార్జి శ్రీనివాస్ తెలిపారు. బీబీపేట్‌లో 532 మందికి అందరూ పరీక్ష రాసినట్లు ఎంఈవో ఎల్లయ్య తెలిపారు. రాజంపేట బాలికల ఉన్నత పాఠశాల, కొండాపూర్ సెంటర్లలో పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని ఎంఈవో రామస్వామి తెలిపారు.