కంటేశ్వర్ ( నిజామాబాద్ ) : జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలనీ దుర్గామాత ఆలయంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపాల ( Ganesh festival ) వద్ద నిర్వహించిన చిన్నారుల వేషాధారణ (Costume parade ) ఎంతగానో అలరించింది. చిన్నారులు కృష్ణుడు, గణపతి, పోతరాజు, అన్నపూర్ణ దేవి, గోపిక వంటి పలు వేషధారణల్లో పాల్గొన్నారు. పిల్లల హావభావాలు, వేషధారణలు ఆకట్టుకున్నాయి. చిన్న వయసులోనే సాంప్రదాయ విలువలను నేర్పించే ఈ తరహా కార్యక్రమాలు తల్లిదండ్రులు, పెద్దల ప్రశంసలు అందుకున్నాయి.
ఆలయ వాతావరణం భక్తి, ఆనందం, సాంస్కృతిక కాంతులతో నిండిపోయింది.
ఈ సందర్బంగా ఆలయ అధ్యక్షులు ఆమందు విజయ్ కృష్ణ మాట్లాడుతూ చిన్నారులు సంస్కృతి, సంప్రదాయాలను ఆచరిస్తూ వేశధారణల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని కార్యక్రమంలో కోశాధికారి ధాత్రిక వేణుగోపాల్, గణేష్ కమిటీ అధ్యక్షులు ధాత్రిక గంగసాయి, కార్యదర్శి ధాత్రిక అఖిల్ రాజ్, సభ్యులు హరీష్, ప్రవీణ్,మహిళలు, భక్తులు పాల్గొన్నారు.