Nizamabad | పోతంగల్ మే 25: పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 అంబులెన్స్‌లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించిన సంఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో చోటు చేసుకుంది.
108 సిబ్బంది వివరాల ప్రకారం మండలంలోని హంగర్గ గ్రామానికీ చెందిన చంద్రకళ మూడవ కాన్పు ఉదయం పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు 108 కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆ మహిళను అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆడబిడ్డ కు జన్మనిచ్చిందనీ,తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు. ఈఎంటి నాగరాణి, పైలెట్ సాయిలు తదితరులున్నారు.