ఖలీల్‌వాడి, జనవరి 13: నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపుబోర్డును నేడు (మంగళవారం) ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
పసుపుబోర్డు చైర్మన్‌గా అంకాపూర్‌కు చెందిన పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేం ద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. మూడేండ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారని పేర్కొన్నది. మరోవైపు, పసుపుబోర్డు ఏర్పాటు స్థలం ఎక్కడో నిర్ణయించక ముందే ప్రైవేట్ హోటల్ వేదికగా ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది.